CHAARU

ఎగ్ పులుసు:
  • గుడ్లను ఉడకబెట్టుకొని, వాటిపై గాట్లు పెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
  • ఇప్పుడు, చింతపండు రసం, చెక్కర కలపాలి.
  • కొన్ని నీళ్ళు, జీలకర్ర పొడి, దనియా పొడి, కొంచం మసాల కలపాలి.
  • ఇప్పుడు, కొబ్బరి పొడి, ఉప్పు, కారం కలుపుకోవాలి.
  • కొబ్బరి పొడి బదులు, నువ్వుల పొడి లేదా పల్లీల పొడి కలుపుకోవచ్చు.
  • ఇప్పుడు, ఉడకబెట్టి గాట్లు పెట్టి ఉంచుకున్న గుడ్లను వేసి కాసేపు ఉంచాలి.
EGG PULUSU:
  • Boil eggs and make little cuts on them.
  • In oil Mustard, Cumin, Turmeric, G&G Paste, chopped onions.
  • Once they fried add Tamarind Juice and Sugar.
  • After they cooked add littlie water, Cumin Powder, Daniya Powder, hot Curry Powder (if u don’t have use little masala), and cook it.
  • Now add coconut Powder, chili Powder, Salt. (Instead of coconut Powder u can use peanut and sesame Powder also).
  • Now add the boiled eggs to this and cook for some time until they grasp some juice.

పచ్చి పులుసు:
  • చింతపండు నానబెట్టుకోవాలి.
  • నూనెలో, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు,పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి.
  • ఇప్పుడు, చింతపండు రసం, నీళ్ళు కలుపుకోవాలి.
  • చెంచా తో తీస్తే, తక్కువ చింతపండు కనబడే విదంగా ఇంకా కొన్ని నీళ్ళు కలుపుకోవాలి.
  • చెక్కర, ఉపు కలుపుకోవాలి.
  • పుల్లగా ఉండకూడదు కాబట్టి, కొంచెం ఎక్కువ చెక్కెర కలుపుకోవాలి.
  • కాసేపు వేడిచేసుకోవాలి.
PACHCHI PULUSU:
  • Soak Tamarind.
  • In oil add Mirchi, Mustard, Cumin seeds, Turmeric, Curry leaves, G&G Paste, and now add Tamarind juice water.
  • You need to add more water in such way that when you pours it with spoon you feel less Tamarind color.
  • Add Sugar, Salt. It should not be sour, so add some more water.
  • Boil for some time.

ఉల్లిపాయల పచ్చి పులుసు
  • చింతపండు నానబెట్టుకొని, నీళ్ళు కలిపి రసం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • ఈ పొపును చింతపండు రసం కి కలుపుకోవాలి.
  • దీనిని మనం మళ్లీ వేడిఛేయ్యం కాబట్టి రసం కి పొపు కలుపుకోవాలి.
  • ఇప్పుడు, చెక్కెర, ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు కలుపుకోవాలి.
  • ఉల్లిపాయలు ఫ్రై చెయ్యనవసరం లేదు.
PACHCHI PULUSU WITH ONIONS:
  • Soak Tamarind, make juice add water and keep it aside.
  • Now in oil add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, Curry leaves.
  • Add this pope to the juice. Don’t pour juice into the pope. We should not boil the juice.
  • After adding pope to the juice add sugar, Salt, chopped onions. No need to fry onions.

గొజ్జి పులుసు:
  • చింతపండు నానబెట్టుకొని, కొన్ని నీళ్ళు కలుపుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • ఇప్పుడు చెక్కెర కలుపుకోవాలి.
  • ఉప్పు, ఉల్లిపాయలు కలుపుకోవాలి.
  • నీళ్ళు తక్కువ వాడతాము కాబట్టి, చెక్కెర ఎక్కువ వాడాలి.
GOJJI PULUSU:
  • Soak Tamarind and take a pulp. Add very little water.
  • Now in oil add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, Curry leaves.
  • Add to pulp, then sugar.
  • Add Salt, onions. It requires more sugar as you are adding less water.

సల్ల చారు:
  • పెరుగుతో మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • దీనిని మజ్జిగ కి కలుపుకొని, పల్లీల పొడి, దనియాల పొడి కలుపుకోవాలి.
SALLA CHARU:
  • Make majjiga with curd.
  • In oil add Mirchi, Mustard, Cumin, Turmeric, garlic pieces, Curry leaves.
  • Add this to majjiga then add Salt, Daniya Powder, peanut Powder.

సల్ల సాంబారు:
  • పెరుగుతో మజ్జిగ చేసుకొని, కొన్ని నీళ్ళు కలుపుకోవాలి.
  • శనిగపిండి కొంచం ఒక గిన్నెలో తీసుకొని, కొన్ని నీళ్ళు కలుపుకోవాలి.
  • ఉండలు లేకుండా చేసుకొని, మజ్జిగ కి కలుపుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • ఇప్పుడు, పోపుకి మజ్జిగ కలుపుకోవాలి.
  • ఉప్పు, కొన్ని నీళ్ళు కలుపుకోవాలి.
  • మజ్జిగ పుల్లగా లేకపోతే, కొంచం నమ్మరసం కలుపుకోవచ్చు.
SALLA SAMBAR:
  • Make majjiga with curd. Add little water. Soak tankarlu in other bowl (if you had) otherwise use sour curd.
  • Take gram flour or besan in bowl add little water, make that Paste without lumps. Add this majjiga and mix it.
  • In oil add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, garlic pieces, Curry leaves.
  • Now add majjiga to this pope, Salt, water if required.( if the curd is not sour and if you don’t have tankarlu u can add very little lemon juice)

టొమాటో రసం:
  • కందిపప్పు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి.
  • నీళ్ళల్లో, తరిగిన టొమాటో ముక్కలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు వేసి ఉడికించుకోవాలి.
  • ఎక్కువసేపు ఉడికించాలి.
  • ఇప్పుడు, ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ని రసం కి కలుపుకోవాలి.
  • ఉప్పు, సాంటీ మిరియాల పొడి, కొంచం మసాలా, అల్లం వెల్లుల్లి వేసి ఇంకాసేపు వేడి చేసుకోవాలి.
  • ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు, కరివేపాకు లతో పొపు చేసుకొని రసం కి కలుపుకోవాలి.
TOMATO RASAM:
  • Cook toor Dal in cooker
  • In a bowl add water. In water chopped tomatoes more, little Turmeric, red Mirchi, Curry leaves sticks,
  • Turmeric, bring to boil. You should boil more.
  • Now add cooked Dal, Salt, sonti-miryala Powder, and little masala, G&G Paste. Again bring to boil. Stop the Flame.
  • Now make a pope by adding Mirchi seeds, Mustard, Cumin, Curry leaves in oil then add this rasam.

టొమాటో చారు:
  • కొన్ని నీళ్ళల్లో, టమాటాలు ఉడికించుకోవాలి.
  • టమాటాలను నలిపి, గుజ్జుని తీసేయ్యాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • దీనికి, టొమాటో రసం, ఉప్పు కలిపి వేడి చేసుకోవాలి.
TOMATO CHAARU:
  • Boil tomatoes in some water.
  • After that make it cool and smash it. Throw out the waste.
  • In oil add Mirchi, Mustard, Cumin, Turmeric, garlic Paste, Curry leaves.
  • Add tomato juice, Salt. Bring it to boil.

ఉండల పులుసు:
  • శనిగపిండి తీసుకొని, అందులో తరిగిన ఉల్లిపాయలు, కారం పొడి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు కలిపి కొన్ని నీళ్ళు చల్లుకోవాలి.
  • మెత్తటి పిండిలా చేసుకోవాలి.
  • కొంచం పిండి తీసుకొని, అరచేతి లో ఉండలుగా చేసుకోవాలి.
  • చింతపండు నానబెట్టి, రసం చేసి పెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
  • ఇప్పుడు, చింతపండు రసం, నీళ్ళు కలుపుకోవాలి.
  • రసం పలుచగా ఉండే విదంగా నీళ్ళు కలుపుకోవాలి.
  • కాసేపు వేడిచేసుకోవాలి.
  • ఉప్పు, చెక్కెర, నువ్వుల పొడి, దనియాల పొడి, ఉండలు కలుపుకోవాలి.
  • రసం గట్టిపడే వరకు వేడిచేసుకోవాలి.
VUNDALA PULUSU:
  • Take besan; add chopped onions, Mirchi Powder, Salt, jeera, coriander leaves. Sprinkle little water to make stiff dough.
  • And make vunDalu.(nee pidikili lo patte kante konchem chinna ga, round ga kakunda, deerga vruthakaram lo)
    Soak Tamarind and make juice.
  • Now in oil add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, Curry leaves, onions. Once they fried add Tamarind juice, more water until you feel that Tamarind color is less when you pour with the spoon.
  • Bring it boil for some time.
  • Now add Salt, sugar, sesame Powder, Daniya Powder, and that vunDalu.
  • Now boil till they get stiff (gattiga ayye varaku). (Sesame Powder is optional).

చామ గడ్డల పులుసు:
  • చామ గడ్డలను ఉడకబెట్టుకొని, పోట్టూ తీసి పెట్టుకోవాలి.
  • చింతపండు నానబెట్టుకోవాలి.
  • శనిగపప్పు నానబెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
  • ఇప్పుడు, చామ గడ్డలు, చింతపండు రసం, నీళ్ళు కలుపుకోవాలి.
  • నానబెట్టి ఉంకుకున్న శనిగపప్పు వేసుకోవాలి.
  • శనిగ పప్పు ఉడికేవరకు వేడి చేసుకొని, ఉప్పు, చెక్కెర వేసుకోవాలి.
  • నువ్వుల పొడి కలిపి కాసేపు ఉంచాలి.
SHYAMA GADDALA PULUSU:
  • Cook shyma gaddalu till they become soft and remove the skin, keep it aside.
  • Soak Chana Dal, Tamarind separately. make juice of Tamarind
  • In oil add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, Curry leaves, onions.
  • Once onions fried, add shyama gaddalu, Tamarind juice, more water.
  • Now add soaked Chana Dal.
  • Boil till Chana Dal cooks then add Salt, sugar bring to boil.
  • Now add sesame Powder. Put for some time. And switch off the stove.

కాకరకాయ పులుసు:
  • కాకరకాయల పై పోర తీసి, సన్నగా, పొడువుగా కట్ చేసుకోవాలి.
  • వాటికి, పసుపు, ఉప్పు కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
  • గంట తర్వాత మంచిగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి.
  • శనిగపప్పు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు, పక్కన పెట్టుకున్న కాకరకాయాలని నూనెలో గొదుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి, శనిగపప్పు, కొన్ని నీళ్ళు కలుపుకోవాలి.
  • చిక్కగా ఉండాలి కాబట్టి, నీళ్ళు కొన్ని మాత్రమే కలపాలి.
  • నానబెట్టి ఉంచుకున్న శనిగపప్పు వేసుకోవాలి.
  • శనిగపప్పు ఉడికిన తర్వాత ఉప్పు, చెక్కెర కలిపి వేడి చెయ్యాలి.
  • ఇప్పుడు, నువ్వుల పొడి కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకోవాలి.
KAAKARAKAAYA PULUSU:
  • Remove the skin part of bitter gourd and make thinner and little lengthy pieces.
  • Now add Turmeric, Salt to pieces. Keep it aside for 1 hour. After wash it cleanly.
  • Soak Chana Dal, Tamarind separately. Make juice of it.
  • Now in oil add bitter gourd pieces fry them till they get light brownish color.
  • Now add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, Turmeric juice, Chana Dal, little water (don’t add more water, it should be very thick means chikkaga vunDali).
  • Now boil it till Chana Dal cooks. Then add Salt, sugar (it requires more sugar as you added less water). Bring it boil.
  • Now add sesame Powder (it takes more as the pulusu should be thick) put for 1 min and switch off the stove.

నీళ్ళ చారు:
  • నీళ్ళల్లో చింతపండు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకు రెమ్మలు వేసి వేడి చెయ్యాలి.
  • అల్లం, వెల్లుల్లి, శోంటి, మిరియాల పొడి, దనియాల పొడి వేసి వేడి చెయ్యాలి.
  • ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తో పొపు చేసుకొని కలుపుకోవాలి.
  • ముద్ద పప్పు తో తింటే చాలా బాగుంటుంది.
NEELLA CHARU:
  • In water take Tamarind, red chilly, Turmeric, Salt, Curry leaves stems. bring to boil.(baaga maragaali)
  • Now add G&G Paste, sonti-miryala Powder, Daniya Powder. And bring to boil.
  • Now make a pope by adding chilly seeds, Mustard, Cumin, Curry leaves in oil.
  • You can eat with mudda pappu.

బెండకాయ పులుసు:
  • చింతపండు నానబెట్ట్కొని రసం చేసుకొని పెట్టుకోవాలి.
  • శనిగపప్పు నానబెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత బెండకాయలు, చింతపండు రసం, నీళ్ళు కలుపుకోవాలి.
  • నానబెట్టి ఉంచుకున్న శనిగపప్పు వేసుకోవాలి.
  • శనిగపప్పు ఉడికిన తర్వాత ఉప్పు, చెక్కెర కలిపి వేడి చెయ్యాలి.
  • ఇప్పుడు, నువ్వుల పొడి కలుపుకోవాలి.
  • కాసేపు వేడి చేసి, దించుకోవాలి.
LADYFINGER PULUSU:
  • Soak Chana Dal, Tamarind separately. make juice of Tamarind
  • In oil add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, Curry leaves, onions.
  • Once onions fried, add lady finger, Tamarind juice, more water.
  • Now add soaked Chana Dal.
  • Boil till Chana Dal cooks then add Salt, sugar bring to boil.
  • Now add sesame Powder. Put for some time. And switch off the stove.

దోసకాయ పులుసు:
  • చింతపండు నానబెట్ట్కొని రసం చేసుకొని పెట్టుకోవాలి.
  • శనిగపప్పు నానబెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి.
  • ఫ్రై అయిన తర్వాత దోసకాయలు, చింతపండు రసం, నీళ్ళు కలుపుకోవాలి.
  • నానబెట్టి ఉంచుకున్న శనిగపప్పు వేసుకోవాలి.
  • శనిగపప్పు ఉడికిన తర్వాత ఉప్పు, చెక్కెర కలిపి వేడి చెయ్యాలి.
  • ఇప్పుడు, నువ్వుల పొడి కలుపుకోవాలి.
  • కాసేపు వేడి చేసి, దించుకోవాలి.
DOSA KAAYA PULUSU:
  • Soak Chana Dal, Tamarind separately. make juice of Tamarind
  • In oil add Mirchi, Mustard, Cumin, Turmeric, G&G Paste, Curry leaves, onions.
  • Once onions fried, add Dosakaaya, Tamarind juice, more water.
  • Now add soaked Chana Dal.
  • Boil till Chana Dal cooks then add Salt, sugar bring to boil.
  • Now add sesame Powder. Put for some time. And switch off the stove.

పప్పు కట్:
  • పెసరపప్పు ని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి.
  • పూర్తిగా మెత్తగా చేసుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • ఇప్పుడు, పప్పు కలుపుకొని పలుచగా అయ్యేవరకు నీళ్ళు కలపాలి.
  • కారం పొడి, ఉప్పు, దనియాల పొడి, నిమ్మరసం కలిపి వేడి శేశుకోవాలి.
  • పుల్లగా ఉండటానికి ఎక్కువ నిమ్మరసం కలపాలి.
PAPPU CUT:
  • Cook the Moong Dal in pressure cooker for 2 to 3 whistles.
  • If u don’t have cooker, cook it more and use smasher to smash the Dal.
  • Dal should be smashed completely.
  • Now in oil add Mustard, Cumin, Turmeric, G&G Paste, garlic pieces, Curry leaves, add this Dal and add more water till it gets very liquid.
  • Now add Mirchi Powder, Salt, Daniya Powder, lemon juice (it needs little more as it should be sour) and bring it boil for some time.

సొరకాయ పులుసు:
  • టొమాటోలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
  • నూనెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సొరకాయ, మూనక్కాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి.
  • గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటోలు, ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకోవాలి.
BOTTLEGUARD PULUSU:
  • Make grind of tomato(more tomatoes).
  • In oil add pope items,onions, mirchi, sorakaya pieces, drum sticks fry it.
  • Add water cook it for some time then add tomato juice, salt,lemon juice,coriander leaves.