RICE ITEMS

క్యాప్సికం అన్నం :
  • ఎండు మిరపకాయలు, దనియాలు, జీలక, ఆవాలు, పల్లీలు, పెసర పప్పు, కరివేపాకు లను పెనం మీద వేయించుకోవాలి.
  • దానిని, మిక్సర్ లో పొడి చేసుకోవాలి.
  • ఇంకో గిన్నెలో నూనె తీసుకొని, అందులో క్కాప్సికం ముక్కలు, పసుపు, ఉప్పు, పైన చేసిన పొడిని కలిపి వేడి చెయ్యాలి.
  • అందులో, అన్నం కలపాలి.
  • క్యాప్సికం మసాలా రైస్ తయారవుతుంది.

CAPSICUM RICE :
  • Dry roast the red chilly, Daniya, Jeera, Mustard, Urad Dal, pea nuts, Curry leaves. When you feel fine aroma from this and they get brown color stop it.
  • Grind it coarsely.
  • In oil add capsicum pieces, Turmeric cook it, Salt, add grinded Masala.
  • Then add cooked rice.

లెమన్ రైస్(యెల్లో రైస్):
  • అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
  • నూనెలో శనిగపప్పు వేయించాలి, తర్వాత పెసర పప్పు, పల్లీలు వేసుకోవాలి.
  • అవి గొడుమ రంగులోకి మారగానే, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని, అన్నం కి కలిపి, నిమ్మ రసం కలిపి, మంచిగా కలపాలి.
LEMON RICE:
  • Cook rice and keep aside.
  • In oil add Chana Dal once it is fried; add little bit Urad Dal then peanuts.
  • Once they get light brown color add Mirchi, Mustard, Cumin, Turmeric, Garlic Paste, Salt, Coriander leaves.
  • Add this pope to the rice and lemon juice too. Mix it.

నువ్వుల పొడి అన్నం:
  • అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
  • నూనెలో శనిగపప్పు వేయించాలి, తర్వాత పెసర పప్పు, పల్లీలు వేసుకోవాలి.
  • అవి గొడుమ రంగులోకి మారగానే, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని, అన్నం కి కలిపి, నువ్వుల పొడి కలిపి, మంచిగా కలపాలి.
SESAME POWDER RICE:
  • Cook rice and keep aside.
  • In oil add Chana Dal once it is fried; add little bit Urad Dal then peanuts.
  • Once they get light brown color add Mirchi, Mustard, Cumin, Turmeric, Garlic Paste, Salt, Coriander leaves.
  • Add this pope to the rice and Sesame Powder too. Mix it.

కొబ్బరి పొడి అన్నం:
  • అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
  • నూనెలో శనిగపప్పు వేయించాలి, తర్వాత పెసర పప్పు, పల్లీలు వేసుకోవాలి.
  • అవి గొడుమ రంగులోకి మారగానే, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని, అన్నం కి కలిపి, కొబ్బరి పొడి కలిపి, మంచిగా కలపాలి.
COCONUT RICE:
  • Cook rice and keep aside.
  • In oil add Chana Dal once it is fried; add little bit Urad Dal then peanuts.
  • Once they get light brown color add chilly, Mustard, Cumin, Turmeric, Garlic Paste, Salt, Coriander leaves.
  • Add this pope to the rice and Coconut Powder too. Mix it.

పుట్నాలపొడి అన్నం:
  • అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
  • నూనెలో శనిగపప్పు వేయించాలి, తర్వాత పెసర పప్పు, పల్లీలు వేసుకోవాలి.
  • అవి గొదుమ రంగులోకి మారగానే, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి.
  • ఈ మిశ్రమాన్ని, అన్నం కి కలిపి, పుట్నాలపొడి,తగినంత ఉప్పు కలిపి, మంచిగా కలపాలి.
FRIED GRAM DAL RICE:
  • Cook rice and keep aside.
  • In pan add oil chana dal, urad dal, peanuts and fry till they get light brown.
  • Now add mirchi,mustard seeds, cumin seeds,turmeric,ginger-garlic paste,curry leaves.
  • After a minute add this to cooked rice and add salt, fried gram dal powder.Mix well.

పెరుగన్నం:
  • అన్నం చాలా మెత్తగా వండుకొని పక్కన పెట్టుకోవాలి(ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీరు పోసి ఉడికించాలి).
  • నూనెలో శనిగపప్పు వేయించాలి, తర్వాత పెసర పప్పు, పల్లీలు వేసుకోవాలి.
  • అవి గొడుమ రంగులోకి మారగానే, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, సోంటీ, మిరియాల పొడి, ఇంగువ, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • **(పసుపు వేయకూడదు.)
  • ఈ మిశ్రమాన్ని, అన్నం కి కలిపి, తరువాత పెరుగు,కొద్దిగా పాలు కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి.

CURD RICE:
  • Cook rice very softly that you can swallow directly.(approximately 1 cup rice nearly 4 cups water)
  • In oil add Chana Dal, Urad Dal, peanuts and fry till they get light brown colour.
  • Once they fried add Mirchi, Cumin, Mustard, Curry leaves,(don’t add Turmeric),pepper- powder, salt, hing. Add this to rice.
  • Now add curd and little milk mix well.
  • Finally add coriander leaves.

చింతపండు అన్నం:
  • శనిగపప్పు, చింతపండు నానబెట్టుకోవాలి.
  • నూనెలో ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, చింతపండు పులుసు, కరివేపాకు రెమ్మలు, నానబెట్టిన శనిగపప్పు, మంచి నీళ్ళు వేసి ఉడికించాలి. నీళ్ళు ఎక్కువ వాడకూడదు.
  • ఇప్పుడు, ఉప్పు, చెక్కర వేకుకొని ఉడికించాలి.
  • నువ్వుల పొడి వేసి ఇంకాసేపు ఉడికించాలి.
  • ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి శనగ పప్పు, మినప్పు, పల్లీలు వేసి కాసేపు వేయించాలీ.
  • ఇప్పుడు ఎండు మిర్చి,ఆవాలు,జీలకర్ర, పసుపు,కరివేపాకు వేసి ఇంకాసేపు వేగనివ్వాలి.
  • పులుసు, పొపు,ఉప్పు వండిన అన్నం కి కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.

TAMARIND RICE:
  • Soak Tamarind and Chana Dal seperately.
  • In oil add red chilly,Mustard,cumin, G&G Paste, Tamarind juice(it should be little bit thick), Curry leaves stems, soaked Chana, water (not much water, it should be thick). then bring to boil
  • Then add Salt, sugar (requires more) then boil finally add sesame Powder. cook for some time.
  • Now make pope by adding litile oil in other pan then add Chana Dal, Urad Dal, peanuts fry till light brown.
  • After green chilly, Mustard, cumin, Turmeric, Salt, Curry leaves.
  • Add tamarind juice(above prepared) and pope to the cooked rice.
  • Garnish with coriander leaves.

జీలకర్ర అన్నం:
  • జీలకర్ర, దనియాలు, మిరియాలను పెనం మీద వేయించుకొని, మిక్సర్ లో పొడి చేసుకొని పెట్టుకోవాలి.
  • నూనెలో ఆవాలు, పసుపు, తరిగిన క్యారొట్, కరివేపాకు, కొద్దిగా కారం పొడి, ఉప్పు మరియు పైన చేసి పెట్టుకున్న పొడి కలుపుకోవాలి.
  • ఇప్పుడు, ఇందులో అన్నం కలుపుకోవాలి.
JEERA RICE:
  • Dry roast the cumin seeds, coriander seeds, and pepper and grind it.
  • In oil add Cumin, Mustard, Turmeric, chopped Carrot, Curry leaves, above Powder, chilly Powder little.saute for a minute.
  • Now add to rice, add salt. mix well.

కరివేపాకు అన్నం:
  • అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
  • జీలకర్ర, దనియాలు, పెసర పప్పు, శనిగపప్పు పెనం మీద వేయించి, మిక్సర్ లో పొడి చేసి పెట్టుకోవాలి.
  • నూనెలో కారెవేపాకు వేయించుకొని, వాటిని మిక్సర్ లో పొడి చేసుకోవాలి.
  • పొపు, పైన చేసిన రెండు పొడులు, ఉప్పు అన్నం కి కలుపుకోవాలి.
CURRY LEAVES RICE:
  • Cook rice.
  • Chana Dal, Urad Dal, cumin seeds, coriander seeds dry roast and grind it coarsely
  • In oil fry Curry leaves and grind it( u can roast them and grind it. so that u can store for long days)
  • In oil add mustard,cumin,green chilly, rice, and Powders, Salt.


స్ప్రౌట్ పాలక్ పనీర్ రైస్:
  • పాన్ లో నూనె వేసి ఆది కాగాక బిర్యానీ ఆకు,దాలిచిన చెక్క,లవంగాలు,యాలకులు వేసి కొంచెం వేపి,ఆవాలు, జీర,మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు సన్నగా పొడుగ్గా కోసిన ఉల్ళిగడ్డ ముక్కలు వేసి కొంచెం గొదుమ రంగు అయ్యే వరకు ఫ్రై చేయాలి.
  • ఇంకా పనీర్ , సన్నగా తరిగిన పాలకూర ,మొలకలు(పెసర,శనగ,బటాని ఇలా ఏవైనా) వేసి కాసేపు వేయించాలీ.
  • కొద్దిగా గరం మసాలా, ఉప్పు,ముందుగా నానబెట్టిన బియ్యం వేయాలి.
  • ఒక కప్ బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
  • చివరగా కొతిమీర కలుపుకోవాలి.
PALAK SPROUT PANEER RICE:
  • In oil add bay leaves,cardamom,cinnamon stick,cloves fry it.
  • Now add mustard, cumin,chilly and saute it.
  • Then add onions fry for some time nad add paneer pieces, chopped palak,sprouts,salt,garam masala,soaked rice,water cook it.
  • Finally coriander leaves.

టమాటో బాత్:
  • పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆది కాగాక శనగ పప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత మినప్పప్పు, ఎండు మిరపకాయలు, దాల్చిన చెక్క, షాహీ జీర, యిలాచి,లవంగాలు, బిర్యానీ ఆకు,అల్లం ముక్కలు ,పచ్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు కొన్ని సన్నగా తరిగిన ఉల్ళిగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేసి ,సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి ఉడికించుకోవాలి.
  • కొద్దిగా కారం, ఉప్పు , జీర పొడి, దనియా పొడి వేసి కాసేపు ఉడికించుకోవాలి.
  • ఉడికించిన అన్నం దానిలో వేసుకొని కలుపుకొని కొతిమీర కూడా వేసుకోవాలి.
TOMATO BATH:
    In oil add chana dal,urad dal fry it then red chilli,cinnamon,black cumin,cardamom,bay leaves fry them Add onions,mint leaves,ginger pieces,garlic pieces,chilly saute it after add tomatoes and cook it. Add salt,chilly powder, cumin powder, coriander powder. Mix it in rice.

మ్యాంగొ రైస్:
  • అన్నం ఉడికించుకొని ఉంచుకోవాలి.
  • మామిడి కాయ తొక్క తీసి తురిమి ఉంచుకోవాలి.
  • పాన్ లో కొద్దిగా నూనె వేసి శనగ పప్పు వేసి ఫ్రై అయ్యాక,మినప్పప్పు,పల్లీలు ఫ్రై చేసుకోవాలి.
  • మిర్చి , ఆవాలు, జీర, కరివేపాకు,అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు గీరిన మామిడి ,తాలింపు , ఉప్పు అన్నం లో కలుపుకోవాలి.
  • చివరగా కొతిమీర వేసుకోవాలి.
MANGO RICE:
  • Cook rice and keep aside.
  • In oil add Chana Dal once it is fried; add little bit Urad Dal then peanuts.
  • Once they get light brown color add green chilly, Mustard, Cumin, Turmeric, Garlic Paste.Saute for a minute.
  • Add this pope to the rice and salt and Grated Mango too. Mix it.
  • Finally add coriander leaves.

బీట్రూట్ అన్నం:
  • బీట్రూట్ తొక్క తీసి తురిమి వుంచుకోవాలి.
  • అన్నం ఉడికించుకొని ఉంచుకోవాలి.
  • ఎండు కొబ్బరి,దనియాలు, అల్లం , వెల్లుల్లి, గసగసాలు,మిర్చి గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.
  • పాన్ లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు,యిలాచి, దాల్చిని చెక్క వేసి కాసేపు ఆగి జీర, కాజి పలుకులు వేసి ఫ్రై చేయాలి.
  • ఇప్పుడు కరివేపాకు, ఉల్లి గడ్డ ముక్కలు,ఉప్పు వేసి గొదుమ రంగు వచ్చేవరకు ఉంచాలి.
  • బీట్రూట్,మసాలా పేస్ట్ వేసి నూనె బయటికి వచ్చేవరకు వేయించుకోవాలి.
  • నానబెట్టి, ఉడికించుకున్న బఠానీ వేసి తర్వాత అన్నం వేసుకొని కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.
BEETROOT RICE:
  • Cook Rice and Let it Cool.
  • For the Masala Grind dry coconut,coriander seeds, ginger,garlic, poppy seeds, Chilly. keep aside
  • Peel the beetroot and grate it and keep aside.
  • In oil add Cumin, cardamom,cloves,cinnamom stick, Cashews, Curry Leaves then add Chopped Onions and add salt to it and fry until they are slightly brown.
  • And add the grated Beetroot,masala paste and fry them until oil comes out of it
  • Then add boiled green peas to it.
  • Now add the cooked rice to it.
  • And mix well by adding coriander leaves and Enjoy the Tasty Beetroot Rice.

బఠానీ పులావ్:
  • బఠానీ రాత్రంత నానబెట్టుకొని, ఉడికించుకోవాలి.
  • నెయ్యి లో కాజూ పలుకులు వేయించుకొని ఉంచుకోవాలి.
  • అదే నెయ్యి లో షాహీ జీర, లవంగాలు,యిలాచీ, దాల్చిని,మిర్చి,కరివేపాకు వేయాలి.
  • సన్నగా చిన్నగా తరిగిన ఉల్లి గడ్డ ముక్కలు,అల్లం-వెల్లుల్లి పేస్ట్, బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు పచ్చి కొబ్బరి పొడి, ఉప్పు వేసుకోవాలి.
  • దీనిలో అన్నం, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కాజూ పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.
PEAS PULAV:
  • Add ghee cashews fry them keep it aside.
  • Same ghee shah jeera,masala items,mirchi,curry leaves fry it.
  • Add chopped onions,g&g paste,turmeric,boiled peas cook it.
  • Add coconut pdr (pachidi),salt cook it.
  • Now add rice cook it.coriander leaves.garnish with cashews. Add ghee cashews fry them keep it aside.
  • Same ghee shah jeera,masala items,mirchi,curry leaves fry it.
  • Add chopped onions,g&g paste,turmeric,boiled peas cook it.
  • Add coconut pdr (fresh),salt cook it.
  • Now add rice cook it.coriander leaves.garnish with cashews.

బరడా అన్నం:
  • శనగ పప్పు ఒక కప్పు, పెసర పప్పు అర కప్పు, కండి పప్పు అర కప్పు , దనియాలు ఒక స్పూన్,జీర అర స్పూన్, ఎండు మిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ పౌడర్ లో కొద్దిగా నూనె , మిరప పొడి, ఉప్పు , కొంచెం నీళ్ళు పోసి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి.
  • ఇప్పుడు కొన్ని నీళ్ళు మరిగించి ఈ ముద్దల్ని దానిలో వేసుకొని కాసేపు ఉడికించాలి.
  • నీళ్ళలో నుంచి తీసి పక్కన ఉంచుకొని పాన్ లో నూనె వేసి దానిలో ఆవాలు, జీర, ఎండు మిరపకాయలు, కరివేపాకు,ఉల్లి గడ్డలు ఫ్రై చేసుకోవాలి.
  • ఉడికించుకున్న పప్పు ముద్దల్ని తాలింపు లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • ఆ ముద్దల్ని పొడిలా చేసుకొని వండి ఉంచిన అన్నం లోకి కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
BAREDA RICE:
  • Chana Dal 1 cup,moong dal 1\2 cup,Toor dal 1\2 cup,Coriander seeds 1
    TBSP,Cumin seeds 1TBSP,dry chilly. grind it coarsely.
  • In that powder add oil, chilly powder,salt, turmeric. mix well.add little water and make little balls
  • Boil little water, in that add those balls and cook it for 15 min.
  • Now strain them.
  • In pan add oil,cumin, mustard, dry chilly,curry leaves,onions and saute for a minute.
  • Then add those balls and fry for some time.
  • Finally smash the balls and add these balls to cooked rice.
  • Garnish with coriander leaves.

మష్రూమ్ పులావ్:
  • పాన్ లో కొంచెం నూనె వేసి ఎండు మిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, యిలాచి వేసి ఫ్రై చేసుకోవాలి.
  • షాహీ జీర, జీలకర్ర,పుదీనా, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లి గడ్డ ముక్కలు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి.
  • ఇప్పుడు పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద, దనియా పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కొంచెం సేపు ఉంచాలి.
  • ఇక మష్రూమ్, ఆలూ, పచ్చి బఠానీ, కొంచెం కారపు పొడి, పెరుగు వేసి కలపాలి.
  • ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పాన్ లో పోసి మరిగించాలి.
  • నీళ్ళు మరిగాక నానబెట్టి ఉంచుకున్న బియ్యంతో ఉడికించూకోవాలి.
  • చివరగా కొతిమీర మరియు వేయించిన కాజూ పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.
MUSHROOM PULAV:
  • In pan add some oil add dry chilly, bay leaves, cloves, cardamom,cashews and fry for minute.
  • Later add black cumin, cumin seeds, mint leaves chopped, thin and long sliced onions.
  • When onions slightly turns brown add turmeric,ginger-garlic paste, coriander powder,garam masala and salt.
  • After a minute add mushrooms,potatoes,fresh peas,little chilly powder,curd. mix all.
  • For 1 cup rice add 2 cups water in the pan and let it boil.
  • Now add the soaked rice and cook it.
  • Finally garnish with coriander leaves and fried cashews.

మామిడి పెసరపప్పు అన్నం:
  • మామిడి కాయని తొక్క తీసి తురిమి ఉంచుకోవాలి.
  • ఒక కప్పు బియ్యానికి అర కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి.
  • పాన్ లో కొద్దిగా నూనె వేసి శనగ పప్పు, పల్లీలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆవాలు,జీలకర్ర,పసుపు,అల్లం-వెల్లుల్లి ముద్ద,మిర్యాల పొడి, మామిడి కాయ తురుమూ వేసుకొని వేగనివ్వాలి.
  • నాన బెట్టిన పెసర పప్పు, బియ్యం, తగినన్ని నీళ్ళు , ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకోవాలి.
మామిడి పెసరపప్పు అన్నం:
  • grate raw mango after peeling.
  • soak moong dal. (moong dal and rice ratio is 1:2)
  • In oil add chana dal,dry mirchi, mirchi green, curry leaves and saute it.
  • Now add mustard, cumin,turmeric,ginger- garlic paste,pepper powder,grated mango. fry it.
  • Now add moong dal,soaked rice,salt and cook it.
  • Garnish with coriander leaves.

ఆమ్చుర్ అన్నం:
  • అన్నం చేసుకొని ఉంచుకోవాలి.
  • పాన్ లో నూనె వేసి దానిలో శనగ పప్పు, మినప్పప్పు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి.
  • ఇంకా ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అంచుర్ పొడి వేసి కాసేపు ఉంచి దీన్ని అన్నం లోకి వేసి, ఉప్పు, కొత్తిమీర తో బాగా కలుపుకోవాలి.

ఆమ్చుర్ అన్నం:
  • Cook rice.
  • In oil add chana dal, urad dal,peanuts fry them.
  • Now add dry chilly,green chilly, mustard, cumin,turmeric,g&g paste, curry leaves,dry mango powder,coriander leaves, salt.
  • Add this to cooked rice.


క్యారొట్ కొబ్బరి అన్నం:
  • ఒక గిన్నె లో నెయ్యి వేసి దానిలో కాజూ ని ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి.
  • ఇప్పుడు దానిలోనే కొద్దిగా నూనె వేసి లవంగాలు, దాల్చిని చెక్క, యిలాచి,పచ్చి మిర్చి,అల్లం-వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
  • దీనిలో పచ్చి బఠానీ, తురిమి ఉంచుకున్న క్యారొట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • కొబ్బరి పాలు, నాన బెట్టి ఉంచుకున్న బియ్యం, తగినన్ని నీళ్ళు (బియ్యం ఒక కప్, కొబ్బరి పాలు ఒక కప్పు, నీళ్ళు ఒక కప్పు), ఉప్పు,గరం మసాలా వేసి ఉడికించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర, వేయించిన కాజూతో గార్నిష్ చేసుకోవాలి.
CARROT COCONUT RICE:
  • Fry cashews in ghee.Keep it aside.
  • In pan add oil, cloves,bay leaves,cinnamon stick,cardamom ,green chilly,g&g paste,curry leaves, onions fry it.
  • Now add peas(boiled),grated carrot and fry for some time.
  • Then coconut milk(coconut milk:rice:water should be 1:1:1),soaked rice,add required water ,little garam masala, salt cook it.
  • Finally coriander leaves, fried cashews.

మొలకల అన్నం:
  • పాన్ లో నూనె వేసి పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాలు, ఉల్లి గడ్డ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి.
  • ఇప్పుడు నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ ని పాన్ లో వేసి కాసేపు ఉడికించాలి.
  • పలురకాల మొలకలు(పేసర్లు, శనగ, బఠానీ......),ఉప్పు,ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం,తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
  • ఉడికిన అన్నం ని గిన్నె లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.

SPROUT RICE:
  • In oil add onions,chilly,cumin,miryalu,g&g paste,mint paste(grind mint leaves in water), cook it
  • Add mixed sprouts fry them.
  • Now salt,soaked rice,water cook it.
  • Finally coriander leaves.

చింత చిగురు పులావ్:
  • ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు,లవంగాలు,యిలాచి, దాల్చిని చెక్క వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఇంకా మిర్చి, ఉల్లి గడ్డ వేసి కాసేపు ఆగి అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి.
  • ఇప్పుడు చింత చిగురు కూడా వేసి వేగనివ్వాలి.
  • పుదీనా,ఉప్పు, నానబెట్టి ఉంచుకున బియ్యం, తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి.
CHINTHA CHIGURU PULAV:
  • In oil add bay leaves,cloves,cardamom,cinnamon stick saute it
  • Now add g&g paste,chilly,onions, fry for some time.Add chinta chiguru(tamarind tree fresh leaves) chopped fry for some time.
  • add water (required) to cook rice. boil it.
  • Then add soaked rice,salt,mint leaves chopped,coriander leaves cook it.

కార్న్ కాజూ ఫ్రైడ్ రైస్:
  • స్వీట్ కార్న్ ని ఉడికించుకొని ఉంచుకోవాలి.
  • ఒక గిన్నె లో కొద్దిగా శనగ పిండి, మిర్చి పౌడర్, ఉప్పు వేసి కలుపుకొని కొద్దిగా నీరు పోసుకొని గట్టిగా తడుపుకోవాలి.
  • కాజూను పిండి లో వేసి ఒకొక్క కాజూ ని ఆయిల్ లో వేస్తూ దీప్ ఫ్రై చేసుకోవాలి.
  • ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి మిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లి గడ్డ వేసి కాసేపు వేయించుకోవాలి.
  • తర్వాత ఉడక బెట్టిన కార్న్, ఆంచుర్ పొడి, ఉప్పు, ఉడక బెట్టిన అన్నం వేసి కలపాలి.
  • చివరగా కాజూ పకోడీ, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి.
CORN KAJU FRIED RICE:
  • boil sweet corn and keep it aside.
  • In bowl take besan(gram flour),chilly powder,salt,little water to make very thick batter then dip cashews one by one and deep fry them till they get li8 brown colour.
  • in pan add oil,chilly,curry leaves,chopped onions fry them till they get light brown.
  • Now add boiled corn,dry mango powder,salt,cooked rice,kaju pakodi.
  • mix them all. finally coriander leaves.

గోంగూర పులిహొర:
  • ఒక పాన్ లో నూనె వేసి శనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, వేసి కాసేపు వేగనివ్వాలి.
  • ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పసుపు, కొద్దిగా పొడి కారం(ముందే పచీ,ఎండు మిర్చి వేసుకున్నాం కనుక కొద్దిగా వేసుకోవాలి),ఉప్పు వేసుకోవాలి.
  • చాలా కొంచెం చింతపండు రసం, తరిగిన గోంగూర వేసుకొని కాసేపు మూత పెట్టి ఫ్రై చేయాలి .
  • చివరగా ఉడకబెట్టిన అన్నంలోకి కలుపుకోవాలి.
GONGURA PULIHORA:
  • In oil add chana dal,,urad dal,dry chilly,garlic,green chilly saute for a minute.
  • After add mustard seeds,cumin,turmeric,chilly powder(very light as we added
  • Already dry and green chilly),tamarind juice,gongura leaves cook it.
  • finally add salt and add to cooked rice.

ఆవపొడి అన్నం:
  • ఆవాలను గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి.
  • వండి ఉంచుకున్న అన్నం లో ఆవ పొడి, కారపు పొడి, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
  • ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి శనగ పప్పు ,మినప్పప్పు, పల్లీలు వేసి వేయించి, ఎండు మిర్చి, ఆవాలు , జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఫ్రై చేసుకోవాలి
  • ఇంకా కరివేపాకు, పసుపు కూడా వేసి ఈ తాలింపుని అన్నం లోకి వేసి కొత్తిమీర తో కలుపుకోవాలి.
MUSTARD RICE:
  • Grind mustard to make powder.
  • In cooked rice add mustard powder,chilly powder little mix it.
  • Now make a pope in pan by adding oil.
  • In oil add chana dal, urad dal peanuts fry it.
  • Then add dry chilly,mustard,cumin ginger garlic paste and saute for some time.
  • Add turmeric,curry leaves. Add this pope to cooked rice.
  • Finally add rice to pope and mix well.garnish with coriander leaves.

వెజిటబెల్ బిర్యానీ:
  • ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు,లవంగాలు,యిలాచి,షాహీ జీర,దాల్చిని చెక్క, బిర్యానీ పువ్వు,కాజూ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • అవి వేగాక సన్నగా పొడుగ్గా తరిగిన మిర్చి,అల్లం వెల్లుల్లి ముద్ద ,కరివేపాకు వేసి కాసేపు ఆగి సన్నాగ్ పొడుగ్గా తరిగిన ఉల్ళిగడ్డ ముక్కలు వేయించుకోవాలి.
  • తర్వాత క్యారొట్, ఆలూ, బీన్స్,బీట్‌రూట్, కాలిఫ్లోవేర్,మిల్‌మేకర్ వేసి కాసేపు ఉడికించు కోవాలి.
  • ఇంకా తరిగిన పుదీనా, బఠానీ,గరం మసాలా, ఉప్పు వేసి కాసేపు ఉంచాలి.
  • ఇప్పుడు ఒక కప్పు బియ్యనికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి మరిగించుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి ఉడికించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి.
VEGETABLE BIRYANI:
  • In pan add oil then add Bay leaves, Cloves,Cinnamon stick,Cardamoms, Star anise ,cashews fry for some time.
  • Now add green chilly,ginger-garlic paste, onions,curry leaves fry them till they turn brown.
  • Then add carrot pieces, beans pieces, potato pieces, beet root pieces, cauliflower pieces, mushrooms(optional), milmaker(soya product) cook for some time.
  • Now add fresh peas, mint leaves,garam masala, salt.
  • After add water(for 1 cup rice add 1and 1/2 cups water) and let it boil.
  • Then add soaked rice and cook it.
  • Finally add coriander leaves and little lemon juice.
ఎగ్ బిర్యానీ:
  • ఎగ్స్ ఉడికించుకొని దాని పైన తొక్క తీసి ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి అది కాగాక దానిలో లవంగాలు,షాహీ జీర, బిర్యానీ ఆకు,దాల్చిని చెక్క,బిర్యానీ పువ్వు,యిలాచి,కాజూ వేసి వేయించుకోవాలి.
  • అలా వేయించాక దానిలో మిర్చి,అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేయాలి.
  • ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్ళిగడ్డలు, కొద్దిగా ఉప్పు వేసి గొదుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆలూ ముక్కలు,బీన్స్, బఠానీ వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఇంకా బిర్యానీ మసాలా లేదా గరం మసాలా,పెరుగు,ఉప్పు వేసి కాసేపు ఉంచాలి.
  • తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీరు పోసి మరిగించాలి.
  • ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి.
  • ఆది అలా ఉడుకుతూ ఉండగా ఇంకో చిన్న ప్లేట్ లో ఒక చెంచాడు కారం, రుచికి తగ్గ ఉప్పు, ఒక చెంచాడు దనియా పొడి, ఒక చెంంచాడు జీలకర్ర పొడి, ఒక చెంచాడు శనగ పిండి,కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి.
  • దీనిలోకి ఒక ఎగ్ పగులగొట్టి వేసి బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ను వేసి అద్దుకొవాలి.
  • మరొక పాన్ లో కొద్దిగా బటర్ వేసి అలా అడ్డుకున్న ఎగ్స్ ని వేసి అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఎగ్స్ ను ఉడికిన అన్నం లోకి వేసుకొని కలుపుకోవాలి.
  • కొత్తిమీర, బటర్ తో గార్నిష్ చేసుకోవాలి.
EGG BIRYANI:
  • Boil eggs and remove the shell and keep aside.
  • Soak rice at least half an hour.
  • In pan add oil add cloves, cardamom, cinnamon sticks, black cumin,bay leaves, star anise, cashews fry for some time.
  • Now add chilly,mint leaves,curry leaves ginger- garlic paste mix well.
  • Now add chopped onions , little salt fry till they turn light brown.
  • Add potato pieces, beans, fresh peas cook for some time.
  • Now add garam masala or biryani masala ,curd cook it.
  • And add water(1 cup rice add 1 ½ cup water,as we soaked rice before it takes only 1 ½ ),salt let it boil.
  • Once it is boiled add soaked rice and cook it.
  • Now take one plate in that add ½ tsp chilly powder, required salt, ½ tsp coriander powder,1/2 tsp cumin powder,very little ginger-garlic paste,1/2 tbsp gram flour mix well.
  • Then break one egg add to above mixture. Mix well and coat the boiled eggs in the mixture.
  • Now in other pan add little butter and fry these coated eggs on medium flame. Rotate them till they get fried finely.
  • Add these eggs to rice and also coriander leaves. Add butter pieces on top.

పుదీనా రైస్:
  • పుదీనా,కొత్తిమీర సమ పాళ్ళలో తీసుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి.
  • ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి అది కాగాక దానిలో లవంగాలు,షాహీ జీర, బిర్యానీ ఆకు,దాల్చిని చెక్క,బిర్యానీ పువ్వు,యిలాచి,కాజూ వేసి వేయించుకోవాలి.
  • అలా వేయించాక దానిలో మిర్చి, కరివేపాకు వేయాలి.
  • ఇంకా దానిలో ఆలూ ముక్కలు,బీన్స్,పచ్చి బఠానీ వేసి కాసేపు ఉడికించుకోవాలి.
  • కాసేపు ఆగి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలి.
  • తర్వాత గరం మసాలా, కొద్దిగా కొబ్బరి పొడి,ఉప్పు,నీళ్ళు(ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్ళు )పోసుకొని మరిగించుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.
MINT RICE:
  • Grind mint, coriander leaves into paste by taking equal quantities.
  • Now in pan add oil add cloves, bay leaves, cinnamon stick,cardamoms, cashews fry for some time.
  • Then add chilly,curry leaves after add thin and long sliced onions. Let it turn light brown.
  • Then add potatoes cut into cubes, long cut beans, fresh peas saute for some more time.
  • Then add above paste and cook for some time.
  • Add garam masala, coconut powder(little),salt,add water(1 cup rice 2 cups water) and let it boil.
  • Once the water is boiled add soaked rice. Cook it directly or in pressure cooker.

బీసీ బేలే బాత్:
  • ముందుగా కంది పప్పు నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి..
  • ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి దానిలో ఎండు మిర్చి,ఆవాలు,జీలకర్ర,కరివెప్పకు,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాసేపు వేయించాలీ.
  • పచ్చి మిర్చి, ఉల్ళిగడ్డ వేసి ఫ్రై అయ్యాక చిక్కుడు,బీన్స్,ఆలూ,క్యారొట్,సొరకాయ,కాలిఫ్లోవేర్,దిల్ పసన్ద్,ములక్కాడ, వంకాయ(ఇలా ఏవైనా....)
  • చిన్న ముక్కలుగా కోసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి ఉడికించుకోవాలి.
  • దానిలో నానబెట్టిన బియ్యం,నీళ్ళు(ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీళ్ళు) పోసి ఉడికించుకోవాలి.
  • అన్నం ఉడికిన తర్వాత దానిలో ముందుగా ఉడికించి ఉంచుకున్న కంది పప్పు, ఉప్పు, బీసీ బేలే బాత్ మసాలా,చింత పండు రసం(లేదా నిమ్మకాయ రసం) వేసి ఉడికించుకోవాలి.
  • అవసరం అయితే ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి.
  • చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.
MINT RICE:
  • Soak toor dal and cook it very softly.
  • In oil add mustard seeds,cumin seeds,garlic paste,turmeric,curry leaves,red chillies,cashews,green chilly,hing,onions fry for some time.
  • Cut bottle gourd,beans,potato,carrot,cauliflower,lady finger, brinjal,spring onions,ridge gourd,drum sticks into small pieces( apart from these u can use any kind of vegetables) and add them.
  • Saute for some time then add chopped tomatoes.
  • After a minute add soaked rice and water(for 1 cup add around 4 cups of water). Cook it.
  • Once the rice is cooked and vegetables comes to smashy stage then add cooked toor dal,
  • Bisi bele bath masala(you can get in stores),salt,tamarind juice(or u can use lemon juice also) and cook them.
  • If you need more water u can add it. Finally add coriander leaves.

వంకాయ అన్నం:
  • మొదటగా అన్నంని వండి ఉంచుకోవాలి.
  • తర్వాత ఈ అన్నం కి సంబందించిన మసాలా చేసుకోవడానికి ఒక పాన్ లో ఎండు మిరపకాయలు,దనియాలు,శనగ పప్పు, మినప్పప్పు,పల్లీలు,నువ్వులు వేసి దోరగా నూనె లేకుండా వేయించుకోవాలి.
  • ఇంకా దానిలో ఎండు కొబ్బరి,ఇంగువ కూడా వేసుకొని కాసేపు వేయించి చల్లార్చి బెరుసుగ గ్రైండ్ చేసుకోవాలి.
  • ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆది కాగాక దానిలో శనగ పప్పు, మినప్పప్పు వేసి కాసేపు ఫ్రై చేయాలి.
  • దీనిలో ఆవాలు,జీలకర్ర,అల్లం వెల్లుళ్ళు ముద్ద, పసుపు వేసి కాసేపు ఉంచాలి.
  • సన్నగా పొడుగ్గా తరుగుకున్నాఉల్ళిగడ్డ కూడా వేసి గొదుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇంకా సన్నగా పొడుగ్గా తరుగుకున్నా వంకాయ ముక్కల్ని వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని, ఉప్పుని వేసి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నం కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి.
  • చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
VANGI BATH:
  • Soak rice first then cook and keep aside.
  • To make vangi bath first we have to make masala.
  • To prepare masala take the pan add dry chilly,chana dal, urad dal,coriander seeds,little sesame seeds, little peanuts dry roast on low flame for some time till they light brown.
  • Then add dry coconut powder or pieces,hing roast again and cool it and make coarse powder.
  • Now in pan add oil once it is heated add chana dal,urad dal fry for some time.
  • Then add mustard seeds,cumin seeds,turmeric,ginger-garlic paste,long and thin sliced onions fry foe some time till they turn light brown colour.
  • Later add thin and long sliced brinjal and fry them till they become soft.
  • Add grinded masala powder,salt saute for a minute.
  • After add cooked rice mix well and close the lid for some time.

కారపు పులొహొర:
  • అన్నం చేసుకొని ఉంచుకోవాలి.
  • ఎండు మిర్చి,అల్లం ,వెల్లుల్లి, జీలకర్ర పెనం పై వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి.
  • ఒక గిన్నె లో కొద్దిగా నూనె శనగ పప్పు, పల్లీలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఇంకా ఆవాలు,జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి.
  • పైన చేసుకున్న పొడి ని వేసుకొని కలుపుకోవాలి.
  • కాసేపు ఆగి అన్నం,ఉప్పు వేసి కలుపుకోవాలి.
SPICY RICE:
    దోసకాయ పులిహొర:
    • దోస పండుని గీరి ఉంచుకోవాలి మరియుఅన్నం చేసుకొని ఉంచుకోవాలి.
    • వండిన అన్నం లో గీరిన దోసకాయ, పసుపు, కొద్దియగ్ నూనె, ఆవల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
    • ఇప్పుడు ఒక గిన్నె లో లో కొద్దిగా నూనె వేసి శనగ పప్పు, మినప్పప్పు,పల్లీలు వేసి వేగనిచ్చి ఇంకా ఎండు మిర్చి,
    • ఆవాలు,జీలకర్ర, సోంతి, కరివేపాకు,పచ్చి మిర్చి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
    • ఈ తాలింపు ని పైన కలిపి ఉంచుకున్న అన్నం కి కలిపి కొత్తిమీర చల్లుకోవాలి.
    CUCUMBER RICE:
    • Cook rice. Grate dosakaya(which is yellow in colour).
    • In Rice add turmeric,mustrad pdr,salt,grated dosakaya,oil mix them well.
    • Now in pan add oil,dry mirchi,peanuts,chana dal,mustard,jeera,hing,urad dal,curry leaves,mirchi.
    • Now add this pope to rice and mix it weel and finally add coriander leaves.